దుబాయ్‌లో ఉంటున్న ఎన్నారై భార్య, కూతురు దారుణ హత్య
- October 13, 2019

దుబాయ్: దుబాయ్‌లో ఉంటున్న ఎన్నారై భార్య, కూతురు దారుణ హత్యకు గురైన సంఘటన యూపీలోని ఆజంగఢ్‌లో చోటుచేసుకుంది. అక్టోబర్ 5న నూరన్(40), గజాలా(18) అనే తల్లీకూతుళ్లను ఓ యువకుడు హత్యచేసి గ్రామానికి సమీపంలోని వరిపొలంలో పాతిపెట్టాడు. తరువాతి రోజు పొలంకు వెళ్లిన గ్రామస్తులు వారి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతుల ఇంటికి తరుచూ వెళ్లే శుభం విశ్వకర్మ అనే యువకుడిని అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విశ్వకర్మను తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. గత కొంతకాలం తాను గజాలా ప్రేమించుకున్నామని, కానీ ఆమె ఉన్నట్టుండి తనను దూరం పెట్టడం తట్టుకోలేక తల్లీకూతురిని తానే హత్యచేసినట్టు ఒప్పుకున్నాడు.
ఆజంగఢ్ పోలీసు సూపరింటెండెంట్ త్రివేణి సింగ్ తెలిపిన కథనం ప్రకారం... దుబాయ్‌లో పనిచేస్తున్న నీషాన్ కుటుంబం యూపీలోని ఆజంగఢ్ పరిధిలో గల భిఖా గ్రామంలో నివాసముంటోంది. ఐదుగురు పిల్లలతో కలిసి నీషాన్ భార్య నూరన్ ఇంటి వద్దే ఉంటుంది. ఇదే గ్రామానికి చెందిన శుభం విశ్వకర్మ(24) అనే యువకుడు నీషాన్ ఇంటి పక్కనే ఉంటాడు. దీంతో దుబాయ్ నుంచి నీషాన్ వీడియో కాల్ చేసినప్పుడల్లా తీసుకెళ్లి భార్య నూరన్‌తో పాటు కుటుంబ సభ్యులను మాట్లాడించేవాడు. ఈ క్రమంలో నీషాన్ పెద్ద కూతురు గజాలాతో విశ్వకర్మకు చనువు పెరిగింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. అయితే, కొంత కాలం తరువాత విశ్వకర్మను గజాలా దూరం పెట్టింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అక్టోబర్ 5న గజాలాను కలిసేందుకు బలవంతంగా నీషాన్ ఇంట్లోకి వెళ్లేందుకు విశ్వకర్మ ప్రయత్నించాడు.
దీంతో నూరన్ అతడ్ని అడ్డుకుంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అక్కడి నుంచి అతడు వెళ్లిపోయిన తరువాత నూరన్ తన పిల్లలను లోపలి గదిలో పెట్టి తాళం వేసి ఇంటి బయట పడుకుంది. నూరన్ నిద్రపోయిన తరువాత మళ్లీ వచ్చిన విశ్వకర్మ ఆమెను గొంతు పిసికి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి సమీపంలోని వరిపొలంలో పాతిపెట్టాడు. అనంతరం మళ్లీ నీషాన్ ఇంటికి వచ్చిన విశ్వకర్మ గజాలా ఉన్న గది తలుపులు పగలగొట్టి ఆమెను బలవంతంగా సమీపంలోని మలూర గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ గజాలాతో వాగ్వాదానికి దిగిన విశ్వకర్మ ఆమెను కూడా గొంతు నులిమి చంపేశాడు.
మృతదేహాన్ని పక్కనే ఉన్న వరిపొలంలో పాతిపెట్టి అక్కడి నుంచి వచ్చేశాడు. అయితే తరువాతి రోజు(అక్టోబర్ 6న) పొలం పనులకు వెన గ్రామస్తులకు నూరన్ మృతదేహం కనిపించింది. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, నూరన్ ఇంటికి విశ్వకర్మ తరచూ వెళ్లేవాడని గ్రామస్తులు చెప్పడంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతడు నూరన్‌తో పాటు కూతురు గజాలాను కూడా హతమార్చినట్టు అంగీకరించాడు. భార్య, కూతురు హత్యకు గురైనట్లు బంధువుల ద్వారా తెలుసుకున్న దుబాయ్‌లో ఉంటున్న నీషాన్ కన్నీటిపర్యంతమయ్యాడు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







