అయోధ్య వివాదం: 17న తేల్చేస్తాం అంటున్న సుప్రీం
- October 15, 2019
అయోధ్య వివాదంపై 17న తేల్చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అయోధ్యలో అధికారులు 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు.
ఈ ఉత్తర్వులు డిసెంబరు 10వ తేదీ వరకు అమలులో ఉంటాయని జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా ప్రకటించారు. అయోధ్యలో డ్రోన్ల ఉపయోగం, వీడియో చిత్రీకరణపైనా నిషేధం విధించారు. తమ అనుమతి లేకుండా దీపావళి టపాసుల విక్రయం, కొనుగోళ్లు కుదరదన్నారు.
మరోవైపు యూపీ వక్ఫ్‌బోర్డు చైర్‌పర్సన్ జాఫర్ అహ్మద్ ఫరూఖీకి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోజువారీ విచారణలో భాగంగా అయోధ్య వివాదంపై సుప్రీం ధర్మాసనం సోమవారం 38వ రోజు వాదనలు విన్నది. ముస్లింల తర ఫు న్యాయవాది రాజీవ్ ధావన్ ధర్మాసనాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''అన్ని ప్రశ్నలు మమ్మల్నే అడుగుతున్నారు. హిందూ పక్షాలను ఏమీ అడగడం లేదు'' అన్నారు. వివాదాస్పద స్థలంలో బాబ్రీ మసీదును పునర్నిర్మించాలని సున్నీ వక్ఫ్‌బోర్డు కోరింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







