మెగా ఫేక్ పోస్టర్
- October 18, 2019
మెగాస్టార్ చిరంజీవికి సరైన సినిమా పడుతుంది. కొరటాల డైరెక్షన్ లో చిరు సినిమా అంటే ఇప్పుటి నుంచే అంచనాలు పెట్టుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ కి చిరు ఎలా ఉండాలో అలా కొరటాల చూపిస్తాడు అని భావిస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ మూవీలో చిరు డ్యూయల్ రోల్ చేస్తున్నారు అని టాక్ ఉంది. నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి ఆగస్టు లో సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్. ఇక ఈ మూవీ టైటిల్ ఏంటా అని ఆలోచిస్తున్న ఫ్యాన్స్ కి టైటిల్ కూడా వచ్చేసింది. అయితే అది అఫిషియల్ టైటిల్ కాదులెండి! 'గోవింద ఆచార్య' అనే టైటిల్ తో చిరంజీవి ఒక స్టిల్ తో పోస్టర్ కూడా బయటకు వచ్చింది.
అచ్చం ఒరిజినల్ పోస్టర్ లా ఉండడంతో దాని మెగా ఫ్యాన్స్ షేరులు చేయడం స్టార్ట్ చేశారు. దాంతో ఆ పోస్టర్ వైరల్ అయింది. అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని క్లారిటీ లేక ఎవరికి వాళ్ళు ఒరిజినల్ అనుకుని షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ చరణ్ అండ్ మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఆ పోస్టర్ విషయంపై రెస్పాండ్ అయ్యారు. "ఇప్పటి వరకు చిరు 152 చిత్రం టైటిల్ ను ఖరారు చేయలేదని.. మేము సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఇతర వివరాలను ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యాక అధికారికంగా ప్రకటిస్తామని" ట్వీట్ చేయడంతో అది ఫేక్ పోస్టర్ అని తెలుసుకున్నారు. ఇక చిరు కి హీరోయిన్ గా నయనతార ని తీసుకుందాం అనుకున్నారు ఇప్పుడు త్రిషను అకుంటున్నారు. మరి ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







