ఉగ్రవాద క్యాంపులపై భారత ఎటాక్

- October 20, 2019 , by Maagulf
ఉగ్రవాద క్యాంపులపై భారత ఎటాక్

ఉగ్రవాదాన్ని అణచివేసే క్రమంలో భారత సైన్యం దాడులు ప్రారంభించింది. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్ లోని కశ్మీర్‌లో ఉగ్రవాదులపై దాడులు చేశారు. తంగ్ధార్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న నీలం లోయలోని 4 ఉగ్రశిబిరాలపై భారత్ బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఐదు మంది పాక్ సైనికులతో పాటు 10కి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

ఈ దాడిలో పాకిస్థాన్ ఆర్మీ క్యాంపులు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇందులో భారత్ ఆర్టిల్లరీ స్ట్రైక్స్ చేశాయి. అంటే ఫిరంగులు లాంటి వాటితో దాడి చేయగలిగాయి. ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్ ఉగ్రశిబిరాలపై తర్వాత సైన్యం చేసిన మరో కీలక ఆపరేషన్ ఇది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదులు భారత్ లోకి రానున్నారనే హెచ్చరికలతో భారత సైన్యం అప్రమత్తమైంది.

శనివారం అర్ధరాత్రి భారత దాడి ముగిస్తే.. దానికి బదులుగా ఆదివారం ఉదయం తంగ్ధార్ సెక్టార్ లో పాక్ సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఈ దాడుల్లో ఇద్దరు జవాన్లు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాడులు పెరిగే అవకాశాలున్నట్లు భావించి అధికారులు అప్రమత్తమవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com