పంచెకట్టులో మెరిసిన రాజమౌళి
- October 21, 2019
బాహుబలి చిత్రబృందం లండన్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఈ చిత్రం ప్రదర్శింపబడుతుంది. ఇప్పటి వరకు ఈ హాల్ లో అన్నీ ఇంగ్లీష్ చిత్రాలే ప్రదర్శింపబడ్డాయి. మొట్ట మొదటిసారి ఒక ఇంగ్లీషేతర చిత్రమైన బాహుబలి ఈ హాల్ లో ప్రదర్శింపబడటం రికార్డు.
ఈ హాల్ లో రాజమౌళి సాంప్రదాయ పంచె కట్టులో మెరిశాడు. భుజం మీద కండువాతో కనిపించి కనువిందు చేశాడు. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు ఆ ప్రపంచ వేదికపై తెలుగు సాంప్రదాయాన్ని కూడా పరిచయం చేశాడు. మొత్తానికి బాహుబలి సినిమాతో వహ్వా అనిపించిన రాజమౌళి పంచెకట్టుతో వారెవా అనిపించాడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా గతి మారిపోయింది. బాలీవుడ్ వాళ్ళు సైతం అంత బడ్జెట్ కి భయపడి సినిమా తీయలేని రోజుల్లో మన తెలుగు సినిమాని శిఖరాగ్రాన నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







