అమెజాన్ దీపావళి సేల్: 60 శాతం వరకు డిస్కౌంట్, కార్డ్స్‌పై మరో 10%
- October 21, 2019
ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ దీపావళి పండుగ సందర్భంగా మరోసారి ఆఫర్ సేల్స్‌తో ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్పెషల్ సేల్‌తో వచ్చింది. మరోసారి బంపర్ సేల్స్ ప్రకటించాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వరుసగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్, బిగ్ దివాలీ సేల్ నిర్వహిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్‌లో వన్ ప్లస్, శాంసంగ్, నోకియా, అమెజాన్ ఎకో ప్రాడక్ట్స్, ఫైర్ టీవీ స్టిక్, ల్యాప్‌టాప్ పైన ఆఫర్లు అందిస్తున్నారు.
అమెజాన్ ఇండియా యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంకు, రూపేక్రెడిట్, డెబిట్ కార్డ్స్ పైన 10 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డ్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డ్స్, అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ పైన అపరిమిత రివార్డ్ పాయింట్స్, ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచే ప్రత్యేకమైన సేల్, స్పెషల్ అఫర్లు ఉన్నాయి.
Samsung Galaxy M10s, Samsung Galaxy A10s, Vivo U10, Nokia 6.2, OnePlus 7, OnePlus 7 Pro, Redmi 7A, iPhone XR, Poco F1 పైన డిస్కౌంట్స్ ఉన్నాయి. రూ.49 నుంచి మొదలయ్యే యాక్సెసరీల పైన కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, అమెజానన్ ఎకో, ఫైర్ టీవీ, కిండ్లే రేంజ్, ల్యాప్‌టాప్స్, టీవీలు, హోమ్ అప్లియెన్సెస్ పైన డిస్కౌంట్స్ ఇస్తోంది అమెజాన్. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. టాప్ బ్రాండ్స్, సరికొత్త ఉత్పత్తులపై కూడా మంచి డీల్స్ ఉన్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







