భర్త వరుణ్‌కు వితిక షాక్.. బిగ్ బాస్ విన్నర్ ఆమేనట..
- October 22, 2019
బిగ్ బాస్ తెలుగు 3 రియాల్టీ షో రసవత్తరంగా సాగుతోంది. ఆదివారం హౌస్ నుంచి వితిక వెళ్లిపోవడంతో ఆరుగురే మిగిలారు. 13 వారాలుగా బిగ్‌బాస్ ఇంట్లో కలిసి ఉన్న వితిక-వరుణ్ జంట.. షో ఎండింగ్‌కు రెండు వారాల ముందు విడిపోయింది. బిగ్‌బాస్ ఫినాలేకు మరికొన్ని రోజులే ఉండడంతో ఈసారి టైటిల్ ఎవరు గెలుస్తారని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎవరికి వారు అనాలిసిస్ చేస్తూ విన్నర్‌ను డిసైడ్ చేస్తున్నారు. ఐతే ఆదివారం షో నుంచి ఎలిమినేట్ అయిన వితిక బిగ్ బాస్ విన్నర్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది.
బిగ్ బాస్ హౌస్‌లో వితిక, వరుణ్ జంట పరస్పరం సహకరించుకుంటూ గేమ్ ఆడారు. టాస్క్‌ల్లో వితికను గెలిపించేందుకు, నామినేషన్‌లోకి వెళ్లకుండా సేవ్ చేసేందుకు వరుణ్ సందేశ్ పలుసార్లు త్యాగాలు కూడా చేశాడు. హౌస్‌లో ఆమెపై ఎవరైనా నోరు జరినా..వారితో గొడవ పెట్టుకునేవాడు. ఒక విధంగా చెప్పాలంటే తన వైఫ్‌ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు వరుణ్. ఈ నేపథ్యంలో తన భర్తే బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడని వితిక చెబుతుందని అందరూ భావించారు. కానీ వరుణ్‌కు షాకిస్తూ.. రెండో ర్యాంకును కేటాయించింది అతని భార్య. తన అంచనాల ప్రకారం బిగ్ బాస్ తెలుగు 3 టైటిల్‌ను శ్రీముఖే గెలుస్తుందని అంచనా వేసింది వితిక.
ఇక రెండో స్థానంలో వరుణ్ సందేశ్ ఉంటాడని చెప్పిన వితిక.. మూడో ర్యాంకును బాబా భాస్కర్‌కు, నాలుగో స్థానాన్ని రాహుల్‌కు, ఐదో స్థానాన్ని శివజ్యోతికి, ఆరో స్థానాన్ని అలీ రెజాకు కేటాయించింది. మూడు నెలలుగా తాము ప్రెజర్ కుక్కర్లో ఉన్నట్లుగా హౌస్‌లో ఉన్నామని.. కానీ అలీ మాత్రం ఒకసారి ఇంటికి వెళ్లి వచ్చాడని చెప్పింది. అందుకే ఆయనకు ఆఖరి స్థానాన్ని ఇస్తున్నట్లు తెలిపింది. మా మ్యూజిక్‌లో వచ్చే తనిష్ ఇంటర్వ్యూలో తన అంచనాల ప్రకారం ఈ ర్యాంకులు ప్రకటించింది వితిక.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







