వైట్ హౌస్ లో గురువారం నాడు దీపావళి
- October 22, 2019
వాషింగ్టన్: దీపావళి హడావుడి అప్పుడే మొదలైంది. అయితే, మన కంటే ముందే దీపావళి జరుపుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. తన అధికారం నివాసం వైట్ హౌస్ లో ట్రంప్ గురువారంనాడు దీపావళి జరుపుకోనున్నారు. భారత్ లో దీపావళి వేడుకలను జరుపుకోవడానికి మూడు రోజుల ముందే వైట్ హౌస్ లో సంబరాలు జరగనున్నాయి.
2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా వైట్ హౌస్ లో దీపావళి వేడుకలను ప్రారంభించారు. 2017లో భారత సంతతి అమెరికా నేతలతో కలసి ట్రంప్ తొలి సారి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గత ఏడాది దీపావళి వేడుకలకు అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సింగ్ ను ట్రంప్ ఆహ్వానించారు. దీపావళి వేడుకలను ట్రంప్ జరుపుకోనుండటం ఇది మూడోసారి.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







