యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!

- November 10, 2025 , by Maagulf
యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!

యూఏఈ: యూఏఈలో ఫ్రీలాన్సర్లు స్వయం ఉపాధి వీసాల సమీక్షలను కఠినతరం చేయాలన్న ప్రభుత్వ చర్యను స్వాగతించారు. ఈ అదనపు పరిశీలనను రంగాన్ని మరింత విశ్వసనీయంగా మార్చడానికి సానుకూల దశగా భావిస్తున్నారు. కాగా, దరఖాస్తు ప్రక్రియపై వారు స్పష్టమైన మార్గదర్శకాలను కోరుతున్నారు.

నిజమైన ఫ్రీలాన్సర్లు మాత్రమే వ్యవస్థ నుండి ప్రయోజనం పొందేలా చూస్తారని నిర్ధారిస్తుందని దుబాయ్‌కు చెందిన మీడియా ప్రొఫెషనల్ అహ్మద్ సలీం అన్నారు. సమీక్షకు తాను మద్దతుగా నిలుస్తానని స్పష్టం చేశారు.  

ఈ వారం ప్రారంభంలో దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రిని ఉటంకిస్తూ, గ్రీన్ రెసిడెన్సీ అని కూడా పిలువబడే ఫ్రీలాన్స్ వీసాలు అందుబాటులో ఉన్నాయన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, హక్కులను రక్షించడానికి, దుర్వినియోగాన్ని నిరోధించడానికి మరియు వేగంగా విస్తరించిన మార్కెట్‌ను నియంత్రించడానికి సమీక్ష మరియు ఆడిటింగ్ విధానాలను బలోపేతం చేశామని ఆయన అన్నారు. అదే సమయంలో వీసాలను నిలిపివేసినట్లు వార్తలు కేవలం పుకారర్లు మాత్రమేనని ఆయన తోసిపుచ్చారు.

వీసా కన్సల్టెంట్ల ప్రకారం, వ్యవస్థను మెరుగుపరచడంలో కఠినమైన తనిఖీలు సహజమైన ప్రక్రియ. వీసా ఎక్కువ మందికి యూఏఈకి వచ్చి పని చేయడానికి అవకాశం ఇచ్చిందని,  కానీ కొందరు వ్యవస్థను మోసం చేయడానికి ప్రయత్నించారని దుబాయ్‌కు చెందిన వీసా కన్సల్టెంట్ ఇషాన్ అన్నారు.  

అదనపు తనిఖీలు అవకాశాలను పరిమితం చేయడానికి కాదని, వ్యవస్థను బలోపేతం చేయడానికి అని అధికారులు పునరుద్ఘాటించారు. ఫ్రీలాన్స్ వీసా నివాసితులు స్పాన్సర్ లేకుండా స్వతంత్రంగా పని చేయడానికి అనుమతిస్తుందని, కానీ సిబ్బందిని నియమించుకునే లేదా ఇతరులను స్పాన్సర్ చేసే హక్కును ఇవ్వదని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com