ముగ్గు మగువలకు చక్కటి వ్యాయామం
- January 11, 2016
ప్రతి రోజూ ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడం భారతీయ సంప్రదాయం. ముగ్గు ఎక్కువగా రాతి సున్నము, బియ్యం పిండి లేదా రెండూ కలిపి వేస్తారు. సున్నంతో ముగ్గు వేస్తే ఆ వాసనకు తేళ్లూ, జెర్లు, పాములు వంటి విష కీటకాలు ఇంటిలోకి రావు. బియ్యం పిండితో వేస్తే...ఆ పిండి తినటానికి చీమలు చేరతాయి, అవి ఈ విషకీటకాలను చంపుతాయి. సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ..కలర్ ఫుల్ ముగ్గులతో కళకళలాడాల్సిందే... పురాతన కాలం నుంచి ముగ్గు వేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ముగ్గులు రెండు రకాలుగా వేస్తారు. చుక్కలు పెట్టి కలపడం, చుక్కలు లేకుండా కేవలం డిజైన్స్ వేయడం ద్వారా రంగవళ్లులు తీర్చిదిద్దుతారు. ఇలా నిత్యం ముగ్గులు వేయడం సంప్రదాయం మాత్రమే కాదు... దీని వెనక అనేక ఆరోగ్యప్రయోజనాలు కూడా దాగున్నాయి ముగ్గు పెట్టేటప్పుడు ఆడవాళ్లు వంగి చేస్తారు. ఇదంతా శరీరానికి చక్కటి వ్యాయామాన్ని ఇస్తుంది. ఇది చేతి వేళ్ల నుంచి పాదాల వరకు అన్నిటిలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అధిక బరువు, అనవసర కొవ్వు వంటివి శరీరంలో చేరకుండా ముగ్గు వేసే ప్రక్రియ కాపాడుతుంది. అలాగే ముగ్గు వేయడానికి ముందు ఆవు పేడతో ఇంటి ముందు అలుకుతారు. దీనివల్ల పేడలోని ఔషధ గుణాలు ఎన్నోరకాల క్రిములను నాశనం చేసి... ఆరోగ్యాన్నిస్తాయి. ముగ్గు వేసేటప్పుడు ఆడవాళ్లు వంగి లేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్లలో సంతానోత్పత్తి వ్యవస్థ మెరుగుపడుతుంది, కడుపుకి సంబంధించిన వ్యాధులు దూరంగా ఉంటాయి. ముగ్గు వేయడానికి చుక్కలు పెడతారు. అవి కలపడానికి చేతులు అటు ఇటు కదుపుతారు. అలాగే నడుమును కూడా కదిలిస్తూ ఉంటారు. దీని వల్ల నడుము నొప్పులు రావు. వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలు కూడా దూరంగా ఉంటాయి. ముగ్గు వేయడానికి మహిళలు వంగినప్పుడు శ్వాస నిదానంగా పీలుస్తారు. అలా ఇది ఒక విధమైన ప్రాణాయామం. ముగ్గు వేయటం వలన మానసిక వత్తిడితో బాధపడుతున్న మహిళలకు మానసిక సాంత్వన లభిస్తుంది. ఇలా ముగ్గు ద్వారా రిలాక్స్ గా, కంఫర్టబుల్ గా, హ్యాపీగా ఫీలవవచ్చు. ముగ్గులు అదృష్టాన్ని సూచిస్తాయి. ఇలా ముగ్గు వేయడం ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తామని హిందువుల నమ్మకం. కళాత్మకంగా ముగ్గులు వేయడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. ముగ్గులు రకరకాలుగా వేస్తారు. విభిన్న డిజైన్స్ తో ఎంత పెద్దగా అయినా వేసేస్తారు. ఇలా కొత్త డిజైన్స్ లో ముగ్గు పెట్టడానికి చాలా ఏకాగ్రత, ఓపిక అవసరం. ఇలా ఓపిగ్గా, కాన్సంట్రేసన్ తో ముగ్గు వేయడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







