శ్రీనగర్ చేరుకున్న ఈయూ ఎంపీల బృందం
- October 29, 2019
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు ఐరోపా సమాఖ్య(ఈయూ) పార్లమెంటు సభ్యుల బృందం నేడు శ్రీనగర్ చేరుకుంది. 23 సభ్యులతో కూడిన ఈ ఎంపీల బృందం రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించనుంది.
పర్యటనలో భాగంగా కశ్మీర్ లోయ, జమ్ముకశ్మీర్‌లోని ఇతర ప్రాంతాల్లో తాజా పరిస్థితులను స్థానిక ప్రభుత్వ అధికారుల నుంచి తెలుసుకోనుంది. కొందరు స్థానికులతో కూడా ముచ్చటించి వారి నుంచి అభిప్రాయాలను సేకరించనుంది. ఈ సందర్భంగా యూపీ ఎంపీ నథన్ గిల్ మాట్లాడుతూ.. 'విదేశీ ప్రతినిధులతో చర్చల నిమిత్తం కశ్మీర్‌కు వెళ్లే అవకాశం రావడం ఆనందంగా ఉంది. క్షేత్రస్థాయిలో అక్కడేం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ పర్యటన దోహదపడుతుంది' అని అన్నారు.
రాహుల్ విమర్శలు
మరోవైపు ఈయూ పార్లమెంట్ సభ్యుల బృందం జమ్ముకశ్మీర్ పర్యటనను విపక్ష నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. 'జమ్ముకశ్మీర్ పర్యటనకు యూరప్ ఎంపీలను అధికారికంగా స్వాగతించారు. కానీ భారత ఎంపీలను మాత్రం అడ్డుకుంటున్నారు. వారిపై నిషేధం విధిస్తున్నారు. ఇందులో ఏదో తప్పు జరుగుతోంది' అని రాహుల్ ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!







