550వ జయంతి: పాక్‌లో గురునానక్ స్మారక నాణేల విడుదల
- October 30, 2019
ఇస్లామాబాద్: గురునానక్‌దేవ్ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్ నానక్ స్మారక నాణేలను బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు ఫొటోలను ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. 'గురునానక్ జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణేలను పాక్ విడుదల చేసింది' అని పేర్కొన్నారు.
కర్తార్‌పూర్ విషయమై గత ఏడాది నవంబర్లోనే భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, దీనిపై వారం క్రితం ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి కర్తార్‌పూర్‌లోని గురు ద్వారాను ఇది కలుపుతుంది. గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 9న కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. యాత్రికుల సౌకర్యార్థం దీన్ని ముందుగానే ప్రారంభిస్తున్నారు. పాకిస్థాన్‌లోని రావినది ఒడ్డున ఉన్న నారోవల్ జిల్లాలో కర్తార్‌పూర్ సాహిబ్ ఉంది. యాత్రికుల వసతి కోసం పాకిస్థాన్ 80 ఇమ్మిగ్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రోజుకు 5వేల మంది యాత్రికులను అనుమతించనుంది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







