దక్షిణాసియా: ప్రపంచ వృద్ధి కేంద్రం దిశగా పరుగు

- November 04, 2019 , by Maagulf
దక్షిణాసియా: ప్రపంచ వృద్ధి కేంద్రం దిశగా పరుగు

వాషింగ్టన్: భారత్ నేతృత్వంలో దక్షిణాసియా ప్రపంచ వృద్ధి కేంద్రంగా అవతరించే దిశగా ముందుకు సాగుతోందని, 2040 నాటికి ప్రపంచ వృద్ధిలో మూడో వంతు భాగాన్ని అందించగలుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా పరిశోధన వెల్లడించింది. ఐఎంఎఫ్ చేసిన ప్రపంచ భౌగోళిక విభజనలో దక్షిణాసియాలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాలు లేవు. ఐఎంఎఫ్ చేసిన విభజన ప్రకారం, దక్షిణాసియాలో భారత్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు ఉన్నాయి. దక్షిణాసియాలో సరళీకరణ విధానాల అమలు, మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడానికి పెరుగుతున్న కృషి, పనిచేసే సత్తా ఉన్న యువ జనాభా కారణంగా ఈ ప్రాంతం 2040 నాటికి ప్రపంచ వృద్ధిలో మూడో వంతు వాటాను అందించగలుగుతుందని ఐఎంఎఫ్ 'దక్షిణాసియా పైకి ఎగరటానికి సిద్ధంగా ఉందా? స్థిరమయిన, సంఘటిత వృద్ధి అజెండా' అనే శీర్షికతో రూపొందించిన పరిశోధనా పత్రం పేర్కొంది. ఐఎంఎఫ్ ఈ పరిశోధనా పత్రాన్ని సోమవారం ఢిల్లీలో విడుదల చేయనుంది. 'వృద్ధి పథం, అభివృద్ధి రెండు అంశాలలో చూస్తే, ఆసియాలోని మిగతా ప్రాంతాలకన్నా దక్షిణాసియా ప్రపంచ వృద్ధి కేంద్రంగా అవతరించడానికి ఎంతో వేగంగా ముందుకు సాగుతోంది' అని ఐఎంఎఫ్‌లోని ఆసియా, పసిఫిక్ డిపార్ట్‌మెంట్ డిప్యూటి డైరెక్టర్ అనే్న-మేరి గుల్డే వోల్ఫ్ పరిశోధనా పత్రం విడుదల కానున్న తరుణంలో ఒక వార్తాసంస్థకు తెలిపారు. ఐఎంఎఫ్ పరిశోధన ప్రకారం, దక్షిణాసియా లో 2030 నాటికి 150 మిలియన్ మంది లేబర్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తారని గుల్డే వోల్ఫ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com