నవంబర్ నెలఖారున ధనుష్ కొత్త చిత్రం విడుదల!
- November 04, 2019
ధనుష్, మేఘా ఆకాష్ జంటగా గౌతమ్‌మేనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎన్నై నోక్కి పాయుం తోట్టా' చిత్రాన్ని ఈనెల 29వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ధనుష్ అభిమానులు మాత్రం చిత్రం విడుదలపై ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. కారణం.. ఈ చిత్రం ఇప్పటివరకు పలు దఫాలు వాయిదాపడడమే. షూటింగ్ పూర్తి చేసుకుని దాదాపు రెండేళ్లు గడుస్తున్నా 'ఎన్నై నోక్కి పాయుం తోట్టా' విడుదలకు నోచుకోలేదు. ఆర్థిక సమస్యల కారణంగా తెరవెనుకే ఉండిపోయింది. ధనుష్ తాజా చిత్రం 'అసురన్' అమోఘ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో 'ఎన్నై నోక్కి పాయుం తోట్టా'ను విడుదల చేసేందుకు గౌతమ్‌మేనన్, నిర్మాతలు సన్నాహాలు మొదలుపెట్టారు. ఆ ప్రకారం నవంబర్ నెలాఖరున ఈ చిత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ఈసారైనా మిస్సవకుండా ఈ చిత్రం థియేటర్లలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







