ఫేస్బుక్ కొత్త లోగో...
- November 05, 2019
ప్రస్తుతం ప్రంపంచాన్ని సోషల్ మీడియా శాసిస్తోన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనే ఎన్ని మాధ్యమాలు ఉన్నా ఫేస్బుక్ మిగిలిన అన్నింటి కన్నా మిగిలిన వాటిని డామినేట్ చేస్తుందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాట్స్ యాప్, ఇన్ స్టాగ్రామ్ తదితర పేరున్న యాప్స్ కు మాతృసంస్థగా ఉన్న ఫేస్బుక్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులతో యూజర్లను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.
ఈ క్రమంలోనే ఫేస్బుక్ సరికొత్త లోగోతో మనముందుకు రాబోతోంది. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో నూతన లోగోను విడుదల చేసింది. ఫేస్ బుక్ కు అనుబంధంగా ఉన్న పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల నుంచి ఫేస్ బుక్ మరింత స్పష్టతను కోరుకుంటోందని ఈ సందర్భంగా ఫేస్బుక్ యాజమాన్యం ప్రకటించింది.
అంతేకాకుండా ఫేస్బుక్ యూజర్లకు కూడా సామాజిక మాధ్యమాలను గుర్తించడంలో సులువుగా ఉండాలన్న ఉద్దేశంతో లోగోను మార్చినట్టు ఫేస్ బుక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆంటోనియో లూసియో ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఫేస్ బుక్ కొత్త వెబ్సైట్ ను కూడా త్వరలోనే అందుబాటులోకి తేనున్నామని ఆంటోనియో వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







