రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ళ చిన్నారి మృతి

- November 05, 2019 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ళ చిన్నారి మృతి

యూఏఈ: నాలుగేళ్ళ చిన్నారి ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆమె తల్లి తీవ్రంగా గాయపడ్డారు. దుబాయ్‌లోని జబెల్‌ అలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ స్కూల్‌ సమీపంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జబెల్‌ అలి పోలీస్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ డాక్టర్‌ అదెల్‌ అల్‌ సువైది మాట్లాడుతూ, మధ్యాహ్నం 3.40 నిమిషాల సమయంలో ఘటన గురించిన సమాచారం తమకు అందిందనీ, ఈ ఘటనలో ఆఫ్రికన్‌ మోటరిస్ట్‌, బ్రేక్‌కి బదులుగా యాక్సిలరేటర్‌ పెడల్‌ని ప్రెస్‌ చేయడంతో ప్రమాదం చోటు చేసుకుందని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడ్డ చిన్నారిని, ఆమె తల్లిని ఆసుపత్రిలో చేర్చామనీ, అయితే ఈ ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com