బన్నీ ఖాతాలో సరికొత్త రికార్డు!
- November 10, 2019
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. ఆయన తాతయ్య ప్రముఖ హాస్య నటులు అల్లు రామలింగయ్య. ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ మార్క్ చాటుకున్న అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్ నటుడిగా వెండి తెరకు పరిచయం అయినా..తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. అల్లు అర్జున్ చిన్ననాటి నుంచి సినీ వాతావరణంలో పెరగడంతో సినిమాలపై మక్కువతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'గంగోత్రి' సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు.
ఆ తర్వాత దేశముదురు, ఆర్య, బన్ని ఇలా వరుస హిట్స్ తో పాపులారిటీ పెంచుకున్నాడు. డ్యాన్స్, ఫైట్స్ లో తన ప్రత్యేకత చాటుకున్నాడు. నాపేరు సూర్య సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అలా వైకుంఠపురములో' సినిమా నటిస్తున్నాడు. ఈ మూవీలో బన్ని సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఇటీవల మూవీకి సంబంధించి సామజవరగమనా, రాములో రాములా.. అనే సాంగ్స్ విడుదలైన సంగతి తెలిసిందే. క్లాసికల్ మ్యూజిక్ కి వెస్ట్రన్ టచ్ ఇచ్చి థమన్ స్వరపరచిన సామజవరగమనా సాంగ్ ప్రేక్షకులకు అమితంగా నచ్చేసింది. యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ పాట 7 లక్షలకి పైగా లైక్స్ ను యూట్యూబ్ లో దక్కించుకుంది.
ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే తెలుగులో ఓ పాటకి ఇన్ని లైక్స్ రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం సామజవరగమనా సాంగ్ షూటింగ్ కోసం యూనిట్ అంతా యూరప్‌లో ఉంది. అక్కడ బన్నీ లిడో డాన్సర్స్‌తో కలిసి స్టెప్పులేసారు. గత 25 సంవత్సరాలుగా ఎంతో ఫేమస్ అయిన లిడో డాన్స్‌ని బన్నీ చేయడంతో తాజాగా ఆయన ఖాతాలో మరో రికార్డ్ నమోదైంది. ఈ మూవీలో సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







