హైదరాబాద్:సారథి స్టూడియోస్‌లో సినీ వేడుక

- November 11, 2019 , by Maagulf
హైదరాబాద్:సారథి స్టూడియోస్‌లో సినీ వేడుక

హైదరాబాద్‌: ప్రాంతీయతతోపాటు దేశ, విదేశీ చిత్రాలతో నగరవాసులను ఆకట్టుకుంటున్న సారథిస్టూడియో తాజాగా మరో సినీ వేడుకకు సిద్ధమైంది. మూడు రోజులపాటు విదేశీ సినిమాలను ప్రదర్శించి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటుంది. హైదరాబాద్‌ ఫిల్మ్‌క్లబ్‌ ఆధ్వర్యంలో సౌత్‌ కొరియన్‌ చిత్రాలను నడిపించనున్నారు. ఈనెల 13న 200 పౌండ్స్‌, 14న పొట్రేట్‌ ఆఫ్‌ ఏ బ్యూటీ, 15న ది పిరేటస్‌ సినిమాలు ప్రదర్శిస్తున్నట్లు హైదరాబాద్‌ ఫిల్మ్‌క్లబ్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌ ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు సినిమాలు ప్రారంభమవుతాయని, కొరియన్‌ చిత్రాలకు సంబంధించి థియేటర్‌లోని తెరకింది భాగంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌ కనిపిస్తాయని ఆయన చెప్పారు. పరిమిత సీట్లు ఉన్నందున అమీర్‌పేటలోని సారథి స్టూడియోస్‌కు ముందు వచ్చిన వారికే సినిమాలను చూసే అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com