విశాల్ 27వ చిత్రం "యాక్షన్"
- November 11, 2019
మూడురాష్ట్రాల్లో గుర్తింపు రావాలని చాలామంది హీరోలు కోరుకుంటారు. కానీ, అది కొంతమందికే వస్తుంది.అందులో ఒకరు హీరో విశాల్ అలా ప్రేక్షకుల అభిమానంతో ఇంతదూరం రాగలిగాను. నాకు థియేటరే గుడి.. ప్రేక్షకులే దేవుళ్లు'' అని అన్నారు. ఇటీవల సుందర్ సి. దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'యాక్షన్'.ఇందులో కథానాయికగా తమన్నా నటించారు.
నిర్మాత శ్రీనివాస్ ఆడెపు ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది ఈ వేడుకలో విశాల్ మాట్లాడుతూ-''నా కెరీర్లో 'యాక్షన్' 27వ చిత్రం.నేను నటించిన మొత్తం 26 చిత్రాల్లో నాకు ఎన్ని దెబ్బలు తగిలాయో ఈ ఒక్క 'యాక్షన్' చిత్రంలో అన్ని తగిలాయి. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు 150 కోట్ల బడ్జెట్ సినిమాలా అనిపిస్తుంది.
కానీ, మా బడ్జెట్ 60కోట్లు.సుందర్ నిర్మాతలు బాగుండాలని సినిమాలు తీస్తారు . నేను ప్రతి చిత్రానికి నేల టిక్కెట్ కొని సినిమాలు చూస్తాను. అప్పుడే ప్రేక్షకులు ఏ సీన్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారో గమనిస్తాను. నా మిత్రుడు హీరో రానా ఈ సినిమాలో ఒక ర్యాప్ పాడారు. త్వరలోనే మీరు వింటారు. శ్రీను మంచి విజన్, ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్'' అన్నారు.
శ్రీనివాస్ ఆడెపు వేడుకలో ఈ విధంగా మాట్లాడుతూ ''సాఫ్ట్వేర్ ఉద్యోగం సంతృప్తికరంగా అనిపించలేదు. డైరెక్టర్ అవుదామని 6-7 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశా. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్‌లోకి వచ్చి 'ఇస్మార్ట్‌శంకర్, గద్దలకొండ గణేశ్, రాజుగారి గది 3' చిత్రాలను పంపిణీ చేశా. ఇప్పుడు 'యాక్షన్' సినిమాతో నిర్మాతగా మారినందుకు సంతోషంగా ఉంది. ప్రిన్స్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నా'' అన్నారు .నటి తమన్నా ఈ ''యాక్షన్' చిత్రం నాకు డ్రీమ్ ప్రాజెక్ట్'' అన్నారు . నటులు ఆదిత్, ప్రిన్స్, నటీమణులు ఐశ్వర్యా లేక్ష్మి, ఆకాంక్ష, సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ మాట్లాడారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







