కాచిగూడలో ఢీ కొన్న రెండు రైళ్లు..!
- November 11, 2019
హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం జరిగింది. కాచిగూడలోని రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు అధికారులు. అంతేకాకుండా.. రెండు బోగీల మధ్య లొకో పైలట్ చిక్కుకున్నాడు. సిగ్నల్ చూసుకోకుండా.. ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడంతో ఈ పెను ప్రమాదం జరిగింది. ఒక ఎంఎంటీఎస్ ట్రైన్.. మరొక కర్నూల్ ఇంటర్ సిటీ ట్రైన్ రెండు ఢీ కొన్నాయి.
రెండు రైళ్లు ఒకేసారి ఢీ కొనడంతో బోగీలు పక్కకు ఒరిగాయి. దీంతో.. ప్రస్తుతం అటు నుంచి.. ఇటు నుంచి.. వచ్చే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాద ఘటనతో ఒకేసారి అక్కడి ప్రయాణికులు భయాందోళన చెందారు. వెంటనే.. ప్రమాదఘటన ప్రాంతానికి రైల్వే పోలీసులు చేరి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. సాధారణంగా.. బస్సులు, స్కూటీల లాంటి రోడ్డు ప్రమాదం చూస్తుంటాము కానీ.. ఇలాంటి రైళ్ల లాంటి ప్రమాదం జరగడం చాలా అరుదు. ఏదేమైనా.. ఉద్యోగుల నిర్లక్ష్యానికి ఈ ప్రమాదం అద్దం పడుతోంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!