నవాజ్ షరీఫ్ కు పాకిస్థాన్ సర్కారు షరతులు
- November 13, 2019
పాకిస్థాన్: పాకిస్థాన్ సర్కారు చేసిన ప్రతిపాదనను ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తిరస్కరించారు. వైద్యచికిత్స చేయించుకోవాలని పాక్ సర్కారు చేసిన ప్రతిపాదనను నవాజ్ షరీఫ్ తోసిపుచ్చారు. వైద్యచికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు నవాజ్ షరీఫ్ కు పాక్ సర్కారు షరతులు విధించింది. నవాజ్ షరీఫ్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలంటే 7 బిలియన్ల పాక్ రూపాయలను డిపాజిట్ చేసి పూచికత్తు పొందాలని పాక్ సర్కారు ఆదేశించింది. చికిత్స అనంతరం తిరిగి స్వదేశానికి వచ్చాక నవాజ్ షరీఫ్ కోర్టు విచారణను ఎదుర్కోవాలని సర్కారు పేర్కొంది. వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు కూడా నవాజ్ షరీఫ్ కు పాక్ సర్కారు షరతులు విధించడంతో, తాను విదేశాలకు వెళ్లేది లేదని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. తాను బెయిలు కోసం పూచీకత్తు కోర్టుకు ఇప్పటికే సమర్పించానని, కానీ పాక్ సర్కారు విధిస్తున్న షరతులు న్యాయానికి విరుద్ధమని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారని అతని సోదరుడు పీఎంఎల్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ చెప్పారు.
తాజా వార్తలు
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..







