యూఏఈలో బిచ్చగత్తెకు దేశ బహిష్కరణ విధించిన న్యాయస్థానం
- November 14, 2019
అజ్మాన్: అరబ్ దేశాల్లో బిచ్చం ఎత్తుకోవడం నిషేధం. ఎవరైనా బిచ్చం ఎత్తుకుంటూ పోలీసుల కంటబడితే కటకటాల్లోకి వెళ్లాల్సిందే. ఇటీవల ఓ అరబ్ మహిళ ఇలాగే బిక్షాటన చేస్తూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మహిళా పోలీస్ ఆఫీసర్‌కు కనిపించింది. దాంతో ఆమెను ప్రశ్నించిన పోలీస్ అధికారిణిపై దాడికి పాల్పడింది. తాజాగా ఈ కేసు యూఏఈ లోని అజ్మాన్ క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. మహిళను దోషిగా తేల్చిన న్యాయస్థానం ఆమెకు 4 నెలల జైలు శిక్ష విధించింది. అలాగే శిక్షకాలం పూర్తైన వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే, అజ్మాన్ లోని అల్ నుయిమియా ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మహిళా పోలీస్ అధికారిణికి 54 ఏళ్ల అరబ్ మహిళ బిక్షాటన చేస్తూ కనిపించింది. దీంతో యాంటీ బెగ్గింగ్ డ్రైవ్‌లో భాగంగా పోలీసుల ప్రోటోకాల్ ప్రకారం బిచ్చగత్తేను ఐడీ చూపించాలని పోలీస్ అధికారిణి కోరింది.
అంతే, తన వద్ద ఎలాంటి ధృవపత్రాలు లేవని, ఏం చేసుకుంటారో చేసుకోమంటూ దురుసుగా ప్రవర్తించింది. వారించబోయిన పోలీస్ ఆఫీసర్‌పై దాడి చేసి సదరు మహిళ అక్కడి నుంచి తప్పించుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని తాజాగా కోర్టులో హాజరుపరిచారు. విచారణలో తాను పోలీస్ ఆఫీసర్‌పై దాడి చేయలేదని బుకాయించిందా మహిళ. దాంతో పోలీసులు అధికారిణిపై దాడి జరిగి గాయపడడంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన మెడికల్ రిపోర్టును న్యాయస్థానం ముందు ఉంచారు. దీంతో కోర్టు బిచ్చగత్తేను దోషిగా తేల్చింది. అనంతరం ఆమెకు 4 నెలల జైలుతో పాటు దేశ బహిష్కరణ శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







