నిధుల అవకతవకలపై కువైట్ ప్రభుత్వం వైదొలిగింది
- November 16, 2019
కువైట్: అంతర్గత విభేదాలు, మంత్రుల మధ్య ఘర్షణ, పార్లమెంట్ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో కువైట్ ప్రధాని షేక్ జబేర్ ముబారక్ రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం తనతోపాటు యావత్ తన మంత్రిమండలి రాజీనామా లేఖను కువైట్ రాజుకు అందజేశారు. ప్రభుత్వ పెన్షన్ సంస్థ నుంచి రిటైర్డ్ ఉద్యోగులు తీసుకున్న రుణాలపై ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించి వడ్డీరేటు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో గత నెలలోనే ఆర్థిక మంత్రి అల్ హజ్రఫ్ రాజీనామా చేశారు. ప్రస్తుత కేబినేట్ కూర్పుపై మంత్రుల మధ్య విభేదాలు తలెత్తడంతోనే ప్రభుత్వం రాజీనామా చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సైనిక సహాయ నిధి నుండి దాదాపు 800 మిలియన్ డాలర్లు ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఇటీవల రాజీనామా చేసినట్లు కువైట్ రక్షణ మంత్రి శనివారం చెప్పారు.
"ప్రభుత్వం రాజీనామా చేయడానికి ఇది ప్రధాన కారణం" అని ప్రధాన మంత్రి షేక్ జాబర్ ముబారక్ అల్-సబా తన మంత్రివర్గంతో పాటు వైదొలిగిన రెండు రోజుల తరువాత షేక్ నాజర్ సబా అల్-అహ్మద్ అల్-సబా అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







