అగ్ని 2 ప్రయోగం సక్సెస్.. చీకట్లో సైతం

అగ్ని 2 ప్రయోగం సక్సెస్.. చీకట్లో సైతం

ఇండియా మరో ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. ఒడిశాలోని బాలాసోర్ నుంచి అగ్ని 2 క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. అయితే, 2000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను అగ్ని 2 మిస్సైల్ విజయవంతముగా ఛేదించగలదు. రాత్రి వేళల్లో సైతం విజయవంతంగా ఈ క్షిపణి లక్ష్యాలను ఛేదిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉదయం సమయంలోనే ప్రయోగించే విధంగా అగ్ని క్షిపణులను శాస్త్రవేత్తలు తయారు చేశారు. కాగా, ఇప్పుడు రాత్రి వేళల్లో కూడా టార్గెట్ ను పర్ఫెక్ట్ గా ఛేదించే క్షిపణిని శాస్త్రవేత్తలు తయారు చేశారు.

Back to Top