మోడీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే బినామీలు బట్టబయలు

- November 17, 2019 , by Maagulf
మోడీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే బినామీలు బట్టబయలు

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నదా…?. ఇప్పటికే పాత నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికట్టడానికి చేస్తోన్న ప్రయత్నాలను మమ్మురం చేయనున్నదా..?. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుందా..?. అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.

దేశంలో ఉన్న నల్లధనాన్ని ,హవాలా లావాదేవీలను అరికట్టే దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకోనున్నది. దేశ వ్యాప్తంగా బినామీల ఆస్తుల లావాదేవీలను అడ్డుకోవడానికి ఒక సరికొత్త చట్టాన్ని తీసుకురావడానికి మోదీ నిర్ణయం తీసుకోనున్నారు.

దేశంలోని స్థిరాస్తుల కొనుగోలు ,అమ్మకాలను ఆధార్ తో అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త చట్టానికి రూపకల్పన చేస్తుంది. ఈ ప్రక్రియ తుదిధశకు చేరింది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్యరూపం దాలిస్తే మాత్రం బినామీలు బట్టబయలు అవుతారని భావిస్తున్నారు.

అంతేకాకుండా భూముల,ఇండ్ల ధరలు నేలకు దిగుతాయని కూడా చెబుతున్నారు. చూడాలి మరి ఈ నిర్ణయం ఎంతవరకు అమలు అవుతుందో..?. ఎంతవరకు విజయవంతమవుతుందో..?.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com