ఛార్‌థామ్ యాత్ర సీజన్ ముగిసింది

- November 18, 2019 , by Maagulf
ఛార్‌థామ్ యాత్ర సీజన్ ముగిసింది

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): చలికాలం సందర్భంగా హిమాలయాల్లో మంచు అధికంగా కురుస్తుండటంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్‌లో ఉన్న ఛార్‌థామ్ దేవాలయాన్ని ఆదివారం సాయంత్రం మూసివేశారు. బద్రీనాథ్ దేవాలయంలో సంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన అనంతరం ఆలయాన్ని మూసివేస్తున్నట్లు బద్రీనాథ్ -కేదార్‌నాథ్ మందిర సమితి ప్రకటించింది. ప్రతి ఏటా అక్టోబరు- నవంబరు నెలల్లో భారీగా మంచుకురుస్తుండటంతో హిమాలయాల్లోని బద్రీనాథ్ దేవాలయాన్ని మూసివేస్తుంటారు. వేసవికాలం సమీపించాక ఏప్రిల్-మే నెల్లో మళ్లీ బద్రీనాథ్ ఆలయాన్ని భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. ఇప్పటికే హిమాలయాల్లో మంచు విస్తారంగా కురుస్తుండటంతో కేదార్‌నాథ్, గంగోత్రీ, యమునోత్రి దేవాలయాలను ఇప్పటికే మూసివేశారు. బద్రీనాథ్ ఆలయాల మూసివేతతో ఛార్‌థామ్ యాత్ర సీజన్ ముగిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com