దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్--కేంద్ర మంత్రి
- November 18, 2019
ఢిల్లీ:గతకొద్ది రోజులుగా దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ అంటూ వస్తున్న వార్తలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసలు దేశానికి రెండో రాజధాని అనే ప్రతిపాదన లేనే లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చర్చ కూడా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే గత కొద్ది రోజుల క్రితం బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యా సాగర్ రావు హైదరాబాద్ దేశానికే రెండో రాజధాని కావొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక సోమవారం నుంచి శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆదివారం సభ నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గత పార్లమెంట్ సమావేశాల్లో ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ రద్దు బిల్లులను తీసుకువచ్చామని గుర్తు చేశారు. ఇక సోమవారం ప్రారంభమయ్యే సమావేశాల్లో తమ ఎజెండాను దేశ ప్రజల ముందు ఉంచుతామన్నారు. విద్య, వైద్యం, నదుల అనుసంధానంపై ఈ సమావేశాల్లో చర్చిస్తామని.. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి తాగు నీరు, వైద్య సేవలు వంటి మౌలిక వసతుల కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.
ఇక ఇదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందని.. ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదాపై కూడా స్పందించారు. ఈ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇస్తామని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హామీ ఇవ్వలేదని.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చామన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!







