అమితాబ్‌కు నోటీసులు పంపిన తెలుగు దర్శకుడు
- November 19, 2019
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ అప్ కమింగ్ మూవీ 'జుంద్' కాపీ రైట్ చిక్కుల్లో పడింది. హైదరాబాద్‌కు చెందిన షార్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్ నంది చిన్నికుమార్ ఆ చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించారు. గత అక్టోబర్ మొదటి వారంలో అమితాబ్‌తో పాటు దర్శకుడు నాగరాజ్ మంజులే, నిర్మాత కృష్ణ కుమార్, భూషణ్ కుమార్, 'స్లమ్ సాకర్' ఎన్జీవో స్థాపకులు అఖిలేశ్ పౌల్, విజయ్ బర్సేలకు నోటీసులు పంపిచారు.
స్లమ్ సాకర్ ఉద్యమానికి ఊపిరి పోసిన నాగ్‌పూర్‌కు చెందిన రిటైర్డ్ స్పోర్ట్స్ టీచర్ విజయ్ బర్సే, 'హోమ్‌లెస్ వరల్డ్ కప్'లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన అఖిలేశ్ పౌల్ జీవిత కథ ఆధారంగా 'జుంద్' సినిమా తీస్తున్నారు. ఇందులో విజయ్ బర్సే పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. అయితే ఈ కథనే తాను 'స్లమ్ సాకర్' అనే పేరుతో సినిమాగా తీద్దామనుకున్నానని నోటీసుల్లో చిన్ని కుమార్ పేర్కొన్నారు. 2017లో పౌల్ నుంచి అనుమతి కూడా తీసుకున్నానని, 'లైఫ్ స్టోరీ రైట్స్ అగ్రీమెంట్'పై సంతకం కూడా చేశారని చిన్ని కుమార్ చెప్పారు. ఏ భాషలోనైనా సినిమా తీసేందుకు సర్వహక్కులు తనకు ఇచ్చారని తెలిపారు. జుంద్ ప్రొడ్యూసర్‌కు తాను ఎన్నిసార్లు మెయిల్స్ పంపినా సమాధానం రాలేదని, పైపెచ్చు తనను బెదిరింపులకు గురి చేశారని నోటీసుల్లో చిన్ని కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!