మార్టినా హింగిస్, సానియా మీర్జా డబుల్స్‌లో వరుస విజయాలు

- January 13, 2016 , by Maagulf
మార్టినా హింగిస్, సానియా మీర్జా డబుల్స్‌లో వరుస విజయాలు

తమ విజయపరంపరను కొనసాగిస్తూ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట మహిళల డబుల్స్‌లో వరుస విజయాల ప్రపంచ రికార్డును సమం చేసింది. వరుసగా 28వ విజయం సాధించిన ఈ ఇండో-స్విస్ ద్వయం 1994లో గీగీ ఫెర్నాండెజ్ (ప్యూర్టోరికో-అమెరికా), నటాషా జ్వెరెవా (బెలారస్) జంట నెలకొల్పిన రికార్డును అందుకుంది. సిడ్నీ ఓపెన్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 6-2, 6-3తో చెన్ లియాంగ్-పెంగ్ షుయె (చైనా) జంటను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది.59 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా-హింగిస్ తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి జంట సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. గురువారం జరిగే సెమీఫైనల్లో రలూకా ఒలారూ (రుమేనియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జంటతో సానియా-హింగిస్ జోడీ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సానియా-హింగిస్ వరుసగా 29 మ్యాచ్‌ల్లో నెగ్గిన జోడీగా ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com