కొత్తిల్లు కొన్న రౌడీ
- November 27, 2019
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సొంతింటికి మారిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు శ్రీనగర్ కాలనీలో ఉంటున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ తాజాగా ఫిల్మ్ నగర్‌లోని కొత్త ఇంటికి మారింది. ఆదివారం తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి గృహప్రవేశం చేశాడు. ప్రస్తుతం సినీవర్గాల్లో విజయ్ ఇల్లు హాట్‌టాపిక్‌గా మారింది. వరుస హిట్లతో విజయ్ ఫుల్ జోష్‌లో ఉన్న విజయ్.. తన రేంజ్‌కు తగినట్లుగా కొత్త ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇంద్ర భవనాన్ని తలపించేలా ఉన్న ఆ ఇంటిని రూపాయలు 15 నుంచి 20 కోట్లు పెట్టి కొన్నట్టు సమాచారం. ఈ ఇల్లు అత్యంత విలాసవంతంగా ఉందట. ఎంతో విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయట. విజయ్ దేవరకొండ స్టైల్‌కి తగ్గట్టుగా ప్రత్యేకంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో కూడా విజయ్ చర్చ మొదలైంది. ఇల్లు కొన్నావ్ సరే.. మరి పెళ్లి ఎప్పుడు విజయ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ‘పెళ్లి చూపులు’ సినిమాతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఆ తర్వాత ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో తన మార్కెట్‌ను అంచెలంచెలుగా పెంచుకున్నాడు. రౌడీ బ్రాండ్ పేరుతో ప్రత్యేకంగా దుస్తులకు సంబంధించి ఓ బ్రాండ్ సృష్టించారు. ఇక ప్రకటనల రూపంలో కూడా విజయ్ బాగానే సంపాధిస్తున్నాడు. పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.
తాజాగా విజయ్ దేవరకొండ.. తన తల్లితండ్రులు, సోదరులతో కలిసి కలిసి ఈ ఇంట్లో శాస్త్రోక్తంగా గృహ ప్రవేశం చేసాడు. ఈ ఆనందకరమైన విషయాన్ని విజయ్.. ట్విటర్లో పోస్ట్ చేశాడు.
తాజా వార్తలు
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!







