సౌదీ అరేబియా లో మరో కొత్త పథకం...
- December 06, 2019
సౌదీ అరేబియా: గత కొంతకాలంగా సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ వరుసగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సౌదీ పౌరసత్వ పథకాన్ని ప్రకటించారు. నిపుణులైన ప్రవాసులే టార్గెట్‌గా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ప్రపంచం నలుమూలల నుండి వచ్చే వివిధ రంగాల్లో నిపుణులైన ప్రవాసులకు ఆ దేశ పౌరసత్వం ఇవ్వనున్నట్లు తాజాగా సౌదీ ప్రకటించింది. మెడిసిన్, సాంకేతికత, సాంస్కృతిక, క్రీడా రంగాలతో సహా వివిధ నేపథ్యాలు కలిగిన నిపుణులకు సౌదీ పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించింది. విజన్ 2030లో భాగంగా సౌదీ తన ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నందున ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఆకర్షించడం కోసం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సౌదీ పౌరసత్వ పథకంపై ట్వీట్ చేసింది. ఈ నిర్ణయం ప్రపంచం నలుమూలల నుండి శాస్త్రవేత్తలు, మేధావులు, ఆవిష్కర్తలను ఆకర్షించడమే తమ లక్ష్యమని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..