ఘనంగా బాలకృష్ణ 106 వ సినిమా ప్రారంభం
- December 06, 2019
బాలకృష్ణ, బోయపాటి శ్రీనులది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతోంది. చాలా రోజుల క్రితమే ఈ చిత్రానికి ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది.
ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు కొందరు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ నెలాఖరు నుంచే రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది. వచ్చే యేడాది వేసవిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మిరియాల రవీంద్రరెడ్డి నిర్మాతగా వ్యవహిరించనున్నారు. ఇక కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలయ్య రూలర్ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







