కువైట్ విమానాశ్రయంలో టెర్మినల్ మూసివేత

- December 06, 2019 , by Maagulf
కువైట్ విమానాశ్రయంలో టెర్మినల్ మూసివేత

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షేక్ సాద్ టెర్మినల్(టీ3) ను కొంత కాలంపాటు మూసివేయనున్నట్లు పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ప్రయాణికుల కోసం జనవరి నుంచి టెర్మినల్ 2 నిర్మాణం చేపట్టబోతున్నందన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. టెర్మినల్ 3కి వెళ్లే రహదారిని కూడా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక దుబాయ్ బడ్జెట్ క్యారియర్- ప్లైదుబాయ్ విమానాలు డిసెంబర్ 15 నుండి టెర్మినల్ 1కి మారుతాయని అధికారులు వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com