దుబాయ్:ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ వేడుకలు
- December 06, 2019
దుబాయ్: గత శుక్రవారం సాయంత్రం దుబాయ్ లోని అల్ నాసర్ క్లబ్ లో ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు మరియు ప్రముఖ కమెడియన్ డా.బాబు మోహన్ ముఖ్య అతిధిగా మరియు మోమిన్(లీగల్ కన్సల్టెంట్),బందెల రాజేస్ అతిధిలుగా విచ్చేశారు.దైవజనులు గొల్ల ఎలీషా ఆధ్వర్యంలో సంఘ క్వయర్ వారిచే మధురగీతములు వినిపించబడ్డాయి.ముఖ్య ప్రసంగీకులుగా దైవజనులు గొల్ల జాకబ్ చక్కని వాక్యోపదేశాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక జీవితం, దైవిక లక్షణాలు కలిగి ఉండాలని సంఘాన్ని ఆత్మీయంగా హెచ్చరించారు.
మాజీ మంత్రివర్యులు, ప్రముఖ సినీనటుడు డా.బాబు మోహన్ ముఖ్య అతిధిగా రావటం, వారియెక్క అమూల్యమైన సాక్షము, జీవితపు విలువలను తమదైన శైలిలో అందించారు. అందరిని ఆనంద సాగరంలో ముంచేసారు.అతిధిగా విచ్చేసిన యౌవన సువార్తికుడు బందెల రాజేస్ ఇచ్చిన హెచ్చరికలు అందరినీ ఆలోచింపజేసాయి.అంతర్జాతీయ సువార్త గాయకురాలు సిస్టర్ సుజాత తమ మధురమైన స్వరముతో దేవున్ని మహిమపరిచారు.చిన్నబిడ్డలు వర్ధిల్, ఆరాధ్య మరియు ప్రిన్సి గంభీరముగా పాడిన చక్కని పాటతో అందరినీ ఆనందములో ముంచెత్తారు.చివరిగా ఈ కార్యక్రమాన్ని కేక్ కటింగ్ అనంతరం అందరూ విందు లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అనురాధ ఓబిలిశెట్టి(లీగల్ కన్సల్టెంట్),షాలేం బాబు(లీగల్ కన్సల్టెంట్) శ్రీకాంత్ చిత్తర్వు(మాగల్ఫ్ చీఫ్ ఎడిటర్) మరియు APNRT కో-ఆర్డినేటర్లు వాసురెడ్డి, ఖాదర్ బాషా,రవి కిరణ్,గుండెల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.






తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







