అగ్ని ప్రమాదాల నివారణకు కొత్త నిబంధనలు
- January 14, 2016
దేశంలోని అన్ని భవనాల్నీ రివ్యూ చేయాలని యూఏఈ నిర్ణయించింది. ఇటీవల వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ మరియు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్తో కలిపి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఓ సర్వే నిర్వహించనుంది. ఆ సర్వేలో వెలుగు చూసే అంశాల్ని బట్టి, కొన్ని నిబంధనల్ని అమల్లోకి తీసుకురానున్నారు. మార్చ్లో భవనాల రక్షణకు సంబంధించి 'కొత్త ఫైర్ సేఫ్టీ కోడ్'ని తీసుకురాబోతున్నారు. ఆ కోడ్ ప్రకారం, ఓ భవనంలో అగ్ని ప్రమాదం జరిగితే, దానికి పూర్తిగా ఆ భవన యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదం కారణంగా జరిగే నష్టానికీ అతనే బాధ్యుడవుతాడు. ఓ భవనం తాలూకు నిర్వహణ విషయాన్ని సదరు భవన యజమాని చూసుకోవాలి. డెవలపర్ కాకుండా, థర్డ్ పార్టీ సంస్థ ద్వారా భవన నిర్మాణంలో భద్రతా ఏర్పాట్లనూ ఆ భవన యజమాని పర్యవక్షించాలి. అగ్ని ప్రమాదాలకు సంబంధించి గతంలో జరిగిన ఘటనల్ని పరిగణనలోకి తీసుకుంటామనీ, కొత్త కోడ్ ద్వారా దేశంలో అగ్ని ప్రమాదాల్ని పూర్తిగా నివారించేలా చర్యలు తీసుకుంటామని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







