భారత వలసదారులకి పాస్‌పోర్ట్ ఇబ్బందులు
- January 14, 2016
వింటర్ బ్రేక్‌లో భాగంగా స్వదేశానికి వెళ్ళాలనుకుంటున్న భారతదేశానికి చెందిన యూఏఈలోని వలసదారులకు పాస్‌పోర్ట్ ఇబ్బందులు తప్పడంలేదు. పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం 2015, సెప్టెంబర్ 5న దరఖాస్తు చేసుకున్నా, అది ఇప్పటిదాకా జరగలేదని అబ్దుల్ గఫూర్ ఇస్మాయిల్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే యూఏఈలోని భారత రాయబారి మాత్రం ఆ ఆరోపణల్ని కొట్టి పారేశారు. పాస్‌పోర్టుల జారీలో ఎలాంటి ఆలస్యం జరగడంలేదని విమవరించారు. అయితే మలేసియా వెళ్ళాలనుకున్న తనకు తన భార్య పాస్‌పోర్ట్ ప్రాసెస్ కాకపోవడంతో వెళ్ళడం కుదరలేదని చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ విధానంలో తత్కాల్ పాస్‌పోర్టులకూ సమస్యలు తప్పడంలేదు. తమ దృష్టికి వచ్చిన అన్ని సమస్యల్నీ పరిష్కరిస్తున్నామనీ, కొన్ని సాంకేతిక కారణాలు, క్లియరెన్స్ ఇబ్బందుల వల్ల చాలా తక్కువ సందర్భాల్లోనే పాస్‌పోర్టుల జారీలో సమస్యలు వస్తున్నాయని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







