మకర సంక్రాంతి శుభాకాంక్షలు....!!
- January 15, 2016గొప్పవారి పుట్టినరోజులు వస్తే చాలు జనాలకు బోలెడు నీతి వాక్యాలు గుర్తుకు వచ్చేస్తాయి... కనీసం వాటిలో మనం ఒక్కటి అయినా పాటిస్తున్నామో లేదో గుర్తుకే రాదు... ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నది మాత్రం మహ చక్కగా పాటించేస్తాం తూ.చ తప్పకుండా... ఎంతయినా ఈ విషయంలో మన వాళ్ళని మాత్రం మెచ్చుకోవాలి.. ప్రతి ఒక్కరికి ఈ రోజు వివేకానందుడు, మొన్న అబ్దుల్ కలాం ఆదర్శం అని నాకు ఈరోజే తెలిసింది.. మనకు ఇక ఏ చట్టాలు, న్యాయాలు అవసరం లేదేమో.. అన్ని సజావుగానే జరిగి పోతాయి.. దేశ నాయకుల నుంచి పల్లెల వరకు అందరికి ఈ ఇద్దరు ఆదర్శమే కదా...
అయిన వాళ్ళ అవసరాలు చూడటం తెలియదు గాని దీనజనోద్దరణకు బయలుదేరతాం... మనలో చెడు ఆలోచనని తగ్గించుకుని ఎదుటి వారిలో కాస్త మంచిని చూడటం అలవాటు చేసుకోగలిగితే కొద్దిగానయినా ఈ పెద్దలు చెప్పిన సద్ది మూటల్లో ఆణి ముత్యాలను ఏరుకున్న వాళ్ళం కాగలుతాం... వాళ్ళు పుట్టిన ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు మనమూ గర్వపడదాం... అందరికీ భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు....
----మంజు యనమదల
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..