మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం: బాలకృష్ణ
- January 15, 2016కొత్త శకానికి సంక్రాంతి పండుగ నాంది పలకాలని సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఈ సారి ఆయన సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని,దేవుడు చల్లని చూపు చూడాలని, పంటలు బాగా పండాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ కేబినెట్ విస్తరణ అనేది ముఖ్యమంత్రి ఇష్టమన్నారు. అయితే అవకాశం వస్తే సమర్థవంతంగా పని చేస్తానని బాలయ్య తన మనసులోని మాటను బయటపెట్టారు. హిందుపురం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని బాలకృష్ణ అన్నారు.
ఇక తన వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై బాలకృష్ణ పలు విషయాలు వెల్లడించారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ 'చివరికి సినిమాల్లోకే రావాలి కదా...నా వందో సినిమాలో మా అబ్బాయి నటించవచ్చు' అని తెలిపారు. డిక్టేటర్ సినిమాపై బాలకృష్ణ మాట్లాడుతూ...అభిమానులకు ఆ సినిమా ఫుల్ ప్లేట్ మీల్స్ గా ఉందని, అన్ని అంశాలు బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు. సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు బాలయ్య ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తన సినిమాల్లో హీరోతో పాటు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ కూడా మహిళల అభ్యున్నతికి కృషి చేశారని ఆయన గుర్తు చేశారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







