దుబాయ్: డేంజరస్ క్రిమినల్ గ్యాంగ్ 'డెత్ ఏంజిల్స్' లీడర్ అరెస్ట్
- December 17, 2019
దుబాయ్:ఏడాదిగా వెతుకుతున్న 'డెత్ ఏంజిల్స్' గ్యాంగ్ లీడర్ రాద్వాన్ తాగిని ఎట్టకేలకు దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డేంజర్ గ్యాంగ్ అత్యంత కరుడుగట్టిన క్రిమినల్ ముఠా. యూరప్, అఫ్రికా దేశాల్లో ఎన్నో నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. నెదర్లాండ్స్, ఇంటర్ పోల్ సహాకారంతో రాద్వాన్ ను అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఏడాది క్రితమే నకిలీ గుర్తింపు కార్డుతో దుబాయ్ లోకి ప్రవేశించిన 41 ఏళ్ల రద్వాన్ పై అప్పట్లోనే అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అధికారుల నుంచి ఆదేశాలు అందుకున్న దుబాయ్ పోలీసు టీం అతని కోసం గాలింపు చేపట్టింది. ఎట్టకేలకు దుబాయ్ లో అతను ఉంటున్న ఇంట్లో సోదాలు చేపట్టి అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







