రికార్డింగ్ స్టూడియోతో షార్జాలో జైల్ ప్రారంభం
- January 16, 2016
కొత్త సెంట్రల్ జైల్ బిల్డింగ్ తొలి ఫేజ్ పూర్తయ్యింది. ఈ జైల్ నిర్మాణం కోసం 400 మిలియన్ దిర్హామ్‌లను వెచ్చిస్తున్నారు. అల్ రమాతా ఏరియాలో దీన్ని నిర్మిస్తున్నారు. 4000 మంది ఖైదీల కోసం అనువుగా నిర్మిస్తున్న ఈ కొత్త జైల్‌లో అనేక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ నిర్మాణంతో వెయ్యి మందికి అకామడేట్ చెయ్యడానికి వీలవుతుంది. రెండు ఫేజుల్లో ఈ జైల్ నిర్మాణాన్ని చేపట్టారు. ఖైదీల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, వారికి జైల్లో సకల సౌకర్యాలూ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్పెంటరీ, సీవింగ్ వంటి పనులు చేసే ఖైదీలకు 100 డాలర్లు వేతనం ఇవ్వనున్నారు. ఖురాన్ పఠనం వంటివి కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ఖురాన్ పఠనంలో ప్రతిభ చూపించినవారికి ప్రత్సాహకాలు కూడా అందిస్తారు. అంతే కాకుండా, శిక్ష అనుభవిస్తూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న ఖైదీలు, వారి కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







