మెగాస్టార్ సినిమాలో రెజీనాకు ఐటమ్ ఆఫర్
- December 31, 2019
'సైరా' తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మ్యాట్నీ మూవీస్ సంస్థతో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇందులో త్రిషను హీరోయిన్‌గా తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. కొరటాల మార్క్ మిస్ అవకుండా ఈ సినిమా రూపొందుతుందని టాక్. ఈ సినిమా దేవాలయ భూముల ఆక్రమణలపై పోరాడే వ్యక్తికి సంబంధించిన కథతో తెరకెక్కుతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నాయి.
ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త హాట్ టాపిక్ అవుతోంది. మాస్ లవర్స్ కోసం ఇందులో ఓ స్పెషల్ సాంగ్‌ను పెట్టబోతున్నారట. ఈ పాట కోసం యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రాను తీసుకొస్తున్నారని సమాచారం. రెజీనా మంచి నటి అనిపించుకున్నా.. బిజీ హీరోయిన్ కాలేకపోయింది. ఐతే, ఐటమ్ సాంగ్స్ మాత్రం చేయలేదు. మెగాస్టార్ సినిమాలో ఐటమ్ ఆఫర్ రావడంతో రెజీనా కాదనలేకపోయిందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..