ఆగిపోయిన త్రిష వివాహం!!
- May 18, 2015
చెన్నై చంద్రం త్రిష లవ్ లైఫ్ పై రూమర్లు చక్కర్లు కొట్టినంతం కాలం కూడా పట్టలేదు... అమ్మడి బ్రేక్ అప్ కు... అంగరంగ వైభవంగా జరిగిన త్రిష, వరుణ్ మణియన్ ల నిశ్చితార్ధం ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే... పెళ్లి పెటాకులైందని అమ్మడు పెట్టిన ట్వీట్ ఫ్యాన్స్ కు మింగుడు పడటంలేదు. ఏమైనా ఈ నాజూకు సోయగం మరోసారి హీరోయిన్ గా బిజీగా మారడం కాస్తంత ఊరటనిచ్చే విషయమే...! అయితే త్రిష పెళ్ళి విషయంలో జనాలు ఇంకా డోలాయమానంలోనే ఉండగానే... మరో బ్యూటీ రాయ్ లక్ష్మి మాత్రం పండగ చేసుకుంటోందట... అదేంటి త్రిష, రాయ్ లక్ష్మీ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ కదా... మరి ఇప్పుడేంటి ఇలా... అన్న డౌట్ వస్తోంది కదా...! అయితే లక్ష్మీ రివెంజ్ వెనుక పెద్ద స్టోరీనే ఉందట.... అసలు వరుణ్ మణియన్ తో తొలుత పరిచయం ఉంది రాయ్ లక్ష్మీకే నట... వీరిద్దరి మధ్య మాంచి కెమిస్ట్రీ నడుస్తున్న సమయంలోనే అమ్మడు త్రిషను వరుణ్ కు పరిచయం చేసిందట.... అసలే కాస్త స్పీడ్ ఎక్కువైన మన చెన్నై చంద్రం.. అబ్బాయితో అడ్వాన్స్ అయిపోయి... మ్యాటర్ ను పెళ్లివరకూ లాక్కొచ్చేసింది... దీంతో రాయ్ లక్ష్మీ సైడ్ అయిపోవాల్సి వచ్చింది.... ఇటీవలే ఈ అక్కసును అమ్మడు మీడియా ముందు బయట పెట్టేసింది కూడా.... త్రిష పెద్ద అబద్ధాల కోరంటూ స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది. అయితే... ఇటీవలే చెన్నై చంద్రం పెళ్లి పెటాకులైందన్న వార్త కన్ఫామ్ అవ్వడంతో లక్ష్మీ ఆనందంతో పొంగిపోతోంది.... ఈ ఉత్సాహంలోనే అమ్మడు ఫ్రెండ్స్ కు గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చిందట.... అంతేనా ఈ పెళ్లి జరగదని ముందే చెప్పానంటూ అమ్మడు చిందులు కూడా వేసేసిందట... ఏదేమైనా ఈ బ్యూటీల మధ్య క్యాట్ ఫైట్ కు బలమైన కారణమే ఉంది.... మరి లక్ష్మీరాయ్ పార్టీ కి ధీటుగా చెన్నై చంద్రం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి....
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









