దుబాయ్ నుంచి జైపూర్, హైద్రాబాద్‌కి స్పైస్‌జెట్ విమానాలు
- January 17, 2016
భారతదేశానికి చెందిన బడ్జెట్ ఎయిర్‌లైన్స్ స్పైస్‌జెట్, దుబాయ్ నుంచి హైద్రాబాద్, జైపూర్‌కి రెండు కొత్త విమాన సర్వీసుల్ని ప్రారంభించింది. దీంతో మొత్తం భారతదేశంలోని పది ప్రాంతాలకు స్పైస్‌జెట్ దుబాయ్ నుంచి ప్రతిరోజూ విమానాల్ని నడుపుతున్నట్లవుతుంది. కొత్త సర్వీసుల ప్రారంభం సందర్భంగా స్పైస్‌జెట్ ప్రయాణీకులకు ఆఫర్లనూ ప్రకటించింది.359 దిర్హామ్‌లతో దుబాయ్ నుంచి జైపూర్‌కీ, 397 దిర్హామహలతో దుబాయ్ నుంచి హైద్రాబాద్‌కీ ఒక మార్గంలో ప్రయాణించడానికి వీలు కల్పిస్తూ ఈ ఆఫర్‌ని స్పైస్‌జెట్ ప్రకటించింది. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయనీ, ఫిబ్రవరి 16 నుంచి విమానాలు ప్రారంభమవుతాయని స్పైస్‌జెట్ అధికారులు వెల్లడించారు. జైపూర్ - దుబాయ్ సెక్టార్‌లో తొలి ప్రైవేటు విమానయాన సంస్థగా స్పైస్‌జెట్ అవతరించింది. బోయింగ్ 737 800 విమానాల్ని సంస్థ వినియోగిస్తుంది. స్పేస్‌జెట్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా, ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్స్, ట్రావెల్ ఎజెంట్స్ ద్వారా ప్రయాణీకులు టిక్కెట్లు పొందవచ్చు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







