సుష్మాస్వరాజ్ ఇజ్రాయెల్ పర్యటన..

- January 17, 2016 , by Maagulf
సుష్మాస్వరాజ్ ఇజ్రాయెల్ పర్యటన..

 భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా ఇవాళ ఆమె ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అంతకు ముందు ఆమె జెరూసలెంలోని క్రీస్తు పుట్టిన ప్రాంతాన్ని సందర్శించారు. సాయంత్రం ఆమె ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఆర్‌ఐలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com