దుబాయ్ లో సురక్షిత రోడ్లను ఏర్పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం
- January 18, 2016
89 సవరణలతో ఇక దుబాయ్ లో సురక్షిత రోడ్లను నూతన కూడళ్ళను నిర్మించడానికి రహదారులు
మరియు రవాణా అధికారులు యోచిస్తున్నారు, ఒక అధ్యయనం ఆధారంగా దుబాయ్ రోడ్ అండ్
ట్రాన్స్పోర్ట్ అధికారులు ఈ చర్యలను తీసుకోనున్నారు. దీని ప్రకారం 29 ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్ది నిత్యం
ఉంటుందని, అలాగే మరో 60 ప్రాంతాల్లో వాహన ప్రమాదాలు తరుచూ జరుగుతున్నట్లు గుర్తించారు.
త్వరితగతిన ట్రాఫిక్ పరిష్కారాల కోసం రహదారులు మరియు రవాణా అధికారులు ఒక ప్రణాళికను
దుబాయి రోడ్లపై భద్రతాస్థాయి అభివృద్ధి కోసం మరో ప్రణాళికను ప్రతిపాదించారు. పలు సందర్బాలలో
ట్రాఫిక్ చిహ్నాలను వాహనదారులు సరిగా గుర్తించకపోవడం , అతి వేగంగా వాహనాలను నడపడం ,
ప్రమాదమని సూచించే ఎర్రని దీపాలను గమనించకపోవడం తదితర కారణాలతో దుబాయ్
రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నాయి. దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు జరిపిన
అధ్యయనం ప్రకారం 60 ప్రాంతాలను గుర్తించి వాటిని ఆధునీకరించేందుకు మెరుగైన చర్యలు
తీసుకోనున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించేవారిని రాడార్ వ్యవస్థ ద్వారా గుర్తించి వారిని
పట్టుకోనున్నామని పేర్కొంటూ , పాదాచారులు నడిచేందుకు మరో మార్గాన్ని సైతం నిర్మించనున్నట్లు
అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







