`జాను` ఫ్రిబ్రవరి 7న సినిమా గ్రాండ్ రిలీజ్
- January 22, 2020
శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం `జాను`. ఈ సినిమాలో తొలి లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
``ప్రాణం నా ప్రాణం..నీతో ఇలా
గానం తొలి గానం పాడే వేళ
తారా తీరం మన దారిలోకాంతులే కురిసేలా
చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా...`` అంటూ హార్ట్ టచింగ్ మెలోడీ ప్రేమలోని గాఢత ఈ పాటలో తెలియచేస్తుంది.
గోవింద్ వసంత సంగీత సారథ్యంలో శ్రీమణి రాసిన ఈ పాటను చిన్నయి, గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. రీసెంట్గా విడుదలైన టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మిగిలిన పాటలను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
నటీనటులు:
శర్వానంద్, సమంత
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: సి.ప్రేమ్‌కుమార్
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్
సమర్పణ: శ్రీమతి అనిత
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజ్
ఆర్ట్: రామాంజనేయులు
మాటలు: మిర్చి కిరణ్
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీమణి
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







