వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన'లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ విడుదల
- February 10, 2020
వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన' చిత్రంలో పాపులర్ తమిళ నటుడు విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రంలో ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోమవారం విడుదల చేశారు. అంబాసడర్ కారుకు ఆనుకొని నిల్చొని, మెలి తిప్పిన మీసాలతో, తీక్షణమైన చూపులతో విజయ్ సేతుపతి కనిపిస్తున్నారు. పోస్టర్ ప్రకారం ఆయన నడివయసు వ్యక్తిలా ఉన్నారు. బ్యాగ్రౌండ్ లో సముద్రం కనిపిస్తోంది.
మరో పోస్టర్లో సిగరెట్ తాగుతూ దీర్ఘాలోచనలో ఉన్న విజయ్ సేతుపతి కనిపిస్తున్నారు. లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన బుచ్చిబాబు సానా.. 'ఉప్పెన'తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ద్వారా కృతి శెట్టి నాయికగా టాలీవుడ్ లో అడుగుపెడుతోంది.
'రాక్ స్టార్' దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ 'ఉప్పెన'ను నిర్మిస్తోంది.
తారాగణం: పంజా విష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ
సాంకేతిక వర్గం:
కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై., అశోక్ బి.
సీఈవో: చెర్రీ
సినిమాటోగ్రఫీ: శాందత్ సైనుద్దీన్
మ్యూజిక్ డైరెక్టర్: దేవి శ్రీప్రసాద్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: మౌనిక రామకృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్, మధు మడూరి
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
విడుదల తేదీ: 2 ఏప్రిల్ 2020
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







