జీడిపప్పులో ఆరోగ్యం...

- January 20, 2016 , by Maagulf
జీడిపప్పులో  ఆరోగ్యం...

జీడిపప్పుని సాధారణంగా స్వీట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తాం. వీటినే కాజు అని పిలుస్తాం. స్వీట్స్ లో మంచి అలంకరణతో పాటు.. మంచి రుచిని కూడా అందిస్తాయి. జీడిపప్పులో అమోఘమైన విటమిన్స్, మినరల్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పు ఫ్యాట్ అని చాలామందిలో అపోహ ఉంది. అయితే.. వీటిని మరీ ఎక్కువగా కాకుండా.. తక్కువ పరిమాణంలో తీసుకుంటే.. ఎలాంటి హాని కలుగదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రెగ్యులర్ గా జీడిపప్పు తీసుకోవాలని అనడానికి అనేక కారణాలున్నాయి. అవి తెలుసుకుంటే.. మీరు ఇకపై జీడిపప్పుకి నో చెప్పే ఛాన్సే లేదు.గుండె ఆరోగ్యంజీడిపప్పులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒలిక్ యాసిడ్ ఉంటుంది. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి గుండె సంబంధిత వ్యాధులను నిరోధిస్తుంది.క్యాన్సర్ జీడిపప్పు ప్రో ఆంతోసైయనైడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వ్యాప్తి చెందించే కారకాలతో వ్యతిరేకంగా పోరాడి, క్యాన్సర్ పెరుగుదలను నివారిస్తాయి. కోలన్ క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించడంలోనూ జీడిపప్పు కీలకపాత్ర పోషిస్తాయి.కండరాలుజీడిపప్పు ద్వారా మెగ్నీషియం పొందవచ్చు. దీనివల్ల బ్లడ్ ప్రెజర్, మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలతో పాటు, క్యాల్షియం లోపంతో వచ్చే కండరాలు, ఎముకల నొప్పుల నుంచి బయటపడవచ్చు.బరువు తగ్గడానికి జీడిపప్పు అంటే.. ఎక్కువ ఫ్యాట్ ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ ఇందులో ఉండే కొవ్వు పదార్థాలు హానికరమైనవి కాదు.. ఆరోగ్యానికి మంచిది. కాబట్టి జీడిపప్పుని డైట్ చేర్చుకుంటే బరువు పెరిగే ఛాన్సే లేదు. అలాగే జీడిపప్పు తినని వారితో పోల్చితే.. తినేవాళ్లు బరువు తక్కువగా ఉంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com