'ఇదేదో బాగుందే' అభినందన సభ
- January 20, 2016
100 రోజుల్లో 9 లక్షల వ్యూస్ సాధించిన షార్ట్ ఫిలిం 'ఇదేదో బాగుందే'. యూ ట్యూబ్‌లో తక్కువ కాలంలో ఇన్ని హిట్స్ సాధించిన షార్ట్ ఫిలింగా గుర్తింపు తెచ్చుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని శ్రీ త్యాగారాయగానసభ, కళా సుబ్బారావు కళా వేదిక, చిక్కడపల్లి, హైద్రాబాద్‌లో అభినందన సభను ఏర్పాటు చేసి, ఇందులో నటించిన కుమారి ఆయుషి దాలిపర్తి ని సన్మానించారు. జనవరి 19న సాయంత్రం 6 గంటలకు అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా రావి కొండలరావుగారు, గౌరవ అతిథులుగా తల్లావజ్జల సుందరంగారు విచ్చేశారు. జివిఎన్ రాజుగారు సభాధ్యక్షులుకాగా, శ్రీమతి భవాని, కళా వెంకట దీక్షితులు ఆత్మీయ అతిథులు. కిషోరుడు దర్శకత్వంలో భారతి బండారు, ఆయుషి దాలిపర్తి నటించిన ఈ షార్ట్ ఫిలిం వంశీ డిఓపీతో అద్భుతంగా రూపొందించబడింది.

తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







