దిల్ రాజు చేతులు మీదుగా ‘నేను లేని నా ప్రేమకథ’ఫస్ట్ లుక్ లాంఛ్
- February 14, 2020
డిఫరెంట్ రోల్స్ తో తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర ఒక కొత్తరకం ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ వాలంటైన్స్ డే స్సెషల్ గా ‘ నేను లేని నా ప్రేమకథ’ ఫస్ట్ లుక్ ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లాంఛ్ చేసారు. ఒక విభిన్నమైన ప్రేమకథగా ప్రేక్షకులు ముందుకు త్వరలో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్ గా ఉందని దిల్ రాజు అభినందించారు.
చిత్రాన్ని ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి సమర్పణలో త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కళ్యాణ్ కందుకూరి నిర్మాతగా సురేష్ దర్శకత్వం లో రూపోందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్టో ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్న
ఈ సినిమాలో నవీన్ చంద్ర సరసన గాయత్రి ఆర్ సురేష్ హీరోయిన్ గా చేస్తుంది. క్రిష్ సిద్దిపల్లి, అదితి లు మరో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రంల ప్రముఖ నటుడు రాజారవీంద్ర కీలక పాత్రలో నటించారు.
ఈ సందర్బంగా నిర్మాత కళ్యాణ్ కందుకూరి మాట్లాడుతూ..
‘దిల్ రాజు గారు మా సినిమా ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రేమకథ లు తెరపై చాలా కనిపించినా ఈ ప్రేమకథ అందించే ఎక్స్ పీరియన్స్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్రతిఓక్కరూ వారి వారి ప్రేమ కథకి కి దగ్గరవుతారు. నవీన్ చంద్ర, హీరోయిన్ గాయత్రి ఆర్ సురేష్ వారి పాత్రల్లో ఇమిడిపోయి నటించారు. ఈ సినిమాకి జువిన్ సింగ్ సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకొని దిల్ రాజు గారు అభినందించారు’ అన్నారు.
నటీనటులు.. నవీన్ చంద్ర, గాయత్రి ఆర్ సురేష్, క్రిష్ సిద్దిపల్లి, అదితి, రాజారవీంద్ర , బందు దివిజ తదితరులు నటించగా..
ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి సమర్పణ
బ్యానర్.. త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్
కొ-ప్రోడ్యూసర్స్.. గూడురు వెంకట్, గూడురు ప్రసాద్
కెమెరా.. ఎస్.కె.ఏ.భూపతి
ఎడిటర్.. ప్రవీణ్ పూడి
మాటలు.. సభీర్ షా
సంగీతం.. జువెన్ సింగ్
లిరిక్స్.. రాంబాబు గొసాల
పి ఆర్ ఒ ..జియస్ కె మీడియా
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







